నిర్మల్, 23 July
దేశ సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ ఢిల్లీలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా నిర్మల్‌లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. నీట్ పరీక్ష పేపర్ లీక్‌పై కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని, లాఠీచార్జ్‌పై ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దేశ సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా నిర్మల్ జిల్లా ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ మాట్లాడుతూ, నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన యువత, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు.
ఈ సంఘీభావ నిరాహార దీక్షలో జిల్లా నాయకులు సేపురి సిద్ధార్థ, ధామా భూమేష్, దేవుళ్ల మధుకర్, మసీదు రమేష్ తదితరులు పాల్గొన్నారు.












