హసన్పర్తి, 3 September
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా అర్హులైన ఏ ఒక్కరి ఓటు హక్కు తొలగిపోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి బాధ్యతతో పనిచేయాలని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు సూచించారు. గురువారం మండలంలోని పాక్పట్ల, సాకేరా గ్రామాల్లో ఆయన ఈ మేరకు పలు సూచనలు చేశారు.
*ప్రతి అర్హుడి ఓటు ఉండేలా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలి:కూచాడి శ్రీహరిరావు* ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా అర్హులైన ఏ ఒక్కరి ఓటు హక్కు తొలగిపోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి బాధ్యతతో పనిచేయాలని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు సూచించారు. గురువారం మండలంలోని పాక్పట్ల, సాకేరా గ్రామాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై గ్రామస్థులు, కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు, నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కూచాడి శ్రీహరి రావు మాట్లాడుతూ.. ఎస్ఐఆర్లో భాగంగా ఓటర్లకు అందుతున్న నోటీసులను బీఎల్ఏలు పూర్తిస్థాయిలో పరిశీలించాలని సూచించారు. నోటీసులు అందుకున్న అర్హులైన ప్రతి ఓటరిని వ్యక్తిగతంగా సంప్రదించి, అవసరమైన గుర్తింపు పత్రాలను సమర్పించేలా సహకరించాలని కోరారు. ఓటరు జాబితాలో అర్హులైన ఒక్కరి పేరు కూడా తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రజలకు ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామాల్లో బీఎల్ఏలు తమ పరిధిలోని ఓటర్ల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాక్పట్ల సర్పంచ్ ఏల్చాల్ రమేశ్, పార్టీ అధ్యక్షుడు మనోద్దీన్, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మధుకర్ రెడ్డి, మాజీ పాక్పట్ల సర్పంచ్ ఏల్చల్ గంగారెడ్డి, ఉప సర్పంచ్ గడ్డం రాజారెడ్డి, సాకేరా సర్పంచ్ లక్ష్మి ఉదయ్, ఉపసర్పంచ్ రాము,కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎల్ఏలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












