పెంబి, 3 September
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా గురువారం నాడు మండల కేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నామని తెలిపారు.
*ప్రజా ప్రభుత్వానికి వెయ్యి రోజుల పండుగ* కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా గురువారం నాడు మండల కేంద్రంలో సంబరాలు జరువుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిసె రమేష్ యాదవ్ మాట్లాడుతూ, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలసి సంబరాలు చేసుకొనడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలకి ఇచ్చిన ప్రతీ హామీ ని మా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది. రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల మన్ననలు పొందుతామన్నారు. ఈ కార్యక్రమములో జిల్లా సెక్రటరీ స్వప్నిల్ రెడ్డి, మండల ఫోరం సర్పంచుల అధ్యక్షుడు మల్లె పెళ్లి సత్యనారాయణ స్వామి, నాగపూర్ సర్పంచ్ బోసు వెంకట్ రాములు, వేణు నగర్ సర్పంచ్ టేకం భీమ్రావు, మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోకల మహేందర్, ఆత్మ కమిటీ డైరెక్టర్ గొర్ల రాజన్న, పట్టణ అధ్యక్షులు గుగ్గిళ్ళ భూమేష్ మరియు వివిధ గ్రామము లకు చెందిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.












