నిర్మల్, 3 September
నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు, ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగిపోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడేలా పార్టీ శ్రేణులు వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగిపోకుండా బాధ్యతగా పనిచేయాలి: కూచాడి శ్రీహరి రావు నిర్మల్: ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగిపోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి బాధ్యతతో పనిచేయాలని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు సూచించారు. నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోని బుధవార్ పెట్,చింతకుంటవాడ, బ్రహ్మపురి ,షెక్సాబ్ పెట్ వార్డులతో పాటు ఇతర వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నియమించిన బీఎల్ఏలు, వార్డు కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, యువ కార్యకర్తలు బాధ్యతలు తీసుకుని పనిచేయాలని తెలిపారు. అలాగే మండలాల వారీగా నియమించిన సూపర్వైజర్లు, గ్రామ బీఎల్ఏలు, గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఎస్ఐఆర్లో భాగంగా ఓటర్లకు అందజేసిన నోటీసులను పూర్తిగా పరిశీలించి, అవసరమైన ఐడీ ప్రూఫ్లను సమర్పించేలా అర్హులైన ప్రతి ఓటరుకు సహకరించాలని సూచించారు. ఓటరు జాబితాలో అర్హులైన ఏ ఒక్కరి పేరు తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడేలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాధ్యతగా వ్యవహరించాలని శ్రీహరి రావు పిలుపునిచ్చారు. ప్రజలకు ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పిస్తూ, అవసరమైన సమయంలో అధికారులను సంప్రదించి సమస్యలను పరిష్కరించేలా సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీంరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు నందెడపు చిన్న ,కౌన్సిలర్ అడ్ప పోశెట్టి,ఆకుల రామకృష్ణ, అజర్ తదితరు పాల్గొన్నారు












