బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 07
ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, సంస్థ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను మంగళవారం బోథ్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దండోరా జెండాను ఆవిష్కరించారు. 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ప్రారంభమైన దండోరా ఉద్యమం లక్ష్యం రాజ్యాంగబద్ధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం సాధించడమేనని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేష్ మాదిగ తెలిపారు.
ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, సంస్థ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను మంగళవారం బోథ్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దండోరా జెండాను ఆవిష్కరించారు.
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేష్ మాదిగ మాట్లాడుతూ, 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ప్రారంభమైన దండోరా ఉద్యమం లక్ష్యం రాజ్యాంగబద్ధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం సాధించడమేనని తెలిపారు. ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు, జైలు నిర్బంధాలు, అక్రమ కేసులు ఎదురైనా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఉద్యమాన్ని కొనసాగించి వర్గీకరణ సాధించగలిగామని పేర్కొన్నారు.
వర్గీకరణ ఫలితాలను మాదిగ యువత, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని విద్య, ఉద్యోగ రంగాల్లో ముందుకు సాగాలని, సమాజానికి మానవ వనరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ సామాజిక ఉద్యమాలకు వేదికగా నిలిచి పేదల సంక్షేమం, మహిళలపై దాడుల నివారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు, దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. రానున్న రోజుల్లో ఉద్యమం రాజకీయ శక్తిగా ఎదిగి రాజ్యాంగబద్ధ హక్కుల సాధనకు మరింత బలంగా పనిచేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఇండ్ల ఎల్లన్న మాదిగ, మాదిగ ఉద్యోగుల సమైక్య నాయకులు గుర్రాల ఆశన్న, ఆరేపల్లి గణేష్, కడదారపు పోచన్న, పెద్దింటి సూర్యప్రసాద్, మేకల జితేందర్, వీహెచ్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నాందేవ్ విలాస్, రాచర్ల శరత్, సుద్దాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.











