లోకేశ్వరం, 3 September
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, దగా పాలన సాగిస్తోందని ముదోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యులు లోలం శ్యాంసుందర్, విలాస్ గాదేవార్, పడకండి రమాదేవి, కిరణ్ కొమరెవర్ మండల కేంద్రంలో అన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలకు నిరసనగా వారు భారీ ర్యాలీ నిర్వహించి, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎండగడుతూ బాకీ కార్డులను ప్రదర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, దగా పాలన సాగిస్తోందని ముదోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యులు లోలం శ్యాంసుందర్, విలాస్ గాదేవార్, పడకండి రమాదేవి, కిరణ్ కొమరెవర్ మండల కేంద్రంలో నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వైఫల్యాలకు నిరసనగా వారి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డు గుండా నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించి, ప్రభుత్వం ఇచ్చిన అబద్ధపు హామీలను ఎండగడుతూ "బాకీ కార్డుల"ను ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో నాయకులు పదునైన విమర్శలతో విరుచుకుపడుతూ, అధికారంలోకి రావడానికి వందలాది వాగ్దానాలు చేసి నేటికి వెయ్యి రోజులు పూర్తయినా ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేదని, ఆరు గ్యారెంటీల కార్డులు ఇప్పుడు కేవలం "బాకీ కార్డులు"గా మిగిలిపోయాయని ధ్వజమెత్తారు. రైతాంగం, నిరుద్యోగులు, మహిళలను నమ్మించి నడిసముద్రంలో ముంచిన ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించిన ఈ నిరసన కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఆర్మీ లా తరలివచ్చి ప్రోగ్రాంను విజయవంతం చేశారు.ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ కన్వినర్ కారిపే శ్యామ్ సుందర్,మండల కన్వీనర్లు దత్తు,శ్యామ్,అనిల్,పాక్స్ మాజీ చైర్మన్ చిన్న రావ్, కల్లూరు సర్పంచ్ దశరథ్,మాజీ ఎంపీపీ సాగర్, మాజీ ఎంపీటీసీ సాయన్న,సర్పంచ్ వెంకటేష్,మాజీ సర్పంచ్ దిగంబర్,సోషల్ మీడియా కన్వినర్ బండి ప్రశాంత్, అనిల్,పాల గంగాధర్ సందీప్, సుధాకర్,ప్రవీణ్ భారీ ఎత్తున్న రైతులు పాల్గొన్నారు












