ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ ఖండించారు. కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేసుకోవడంలో అభ్యంతరం లేదని, అయితే ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అన్నారు.
ఆదివారం ఆయన మాట్లాడుతూ, గతంలో తన తండ్రి పాలనలో ప్రశ్నించలేని కవిత, ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
కవిత తన పార్టీ విధానాలు, ప్రణాళికలపై మాట్లాడాలని, ప్రభుత్వంపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని గోవింద్ నాయక్ సూచించారు.
కవితపై ఉన్న వివిధ కేసులను గుర్తుచేస్తూ, ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే రానున్న రోజుల్లో తెలంగాణలో ఎక్కడా సహించబోమని స్పష్టం చేశారు.












