బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 24
బోథ్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు తిరిగి ప్రజా సేవలో చురుకైన పాత్ర పోషించాలని, ఆయన నాయకత్వం అవసరమని ప్రజలు, అభిమానులు కోరుకుంటున్నారు. "రాథోడ్ బాపూరావు రావాలి... రాథోడ్ బాపూరావు కావాలి!" అనే నినాదం నియోజకవర్గంలో మారుమోగుతోంది.
బోథ్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ఒక్కటే... "రాథోడ్ బాపూరావు రావాలి... రాథోడ్ బాపూరావు కావాలి!" అనే నినాదం ప్రస్తుతం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అభిమానులు, కార్యకర్తల నోట వినిపిస్తోంది. బోథ్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు పేరుపై మరోసారి చర్చ జోరందుకుంది.
ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేసిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని అభిమానులు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల అమలులో రాథోడ్ బాపూరావు చేసిన సేవలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని వారు తెలిపారు.
రాబోయే రోజుల్లో ఆయన మళ్లీ ప్రజా సేవలో చురుకైన పాత్ర పోషించాలని, బోథ్ నియోజకవర్గానికి ఆయన నాయకత్వం అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన తిరిగి ప్రజల మధ్యకు రావాలని కోరుతూ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.












