రోడ్డు ప్రమాదంలో ఫోటోగ్రాఫర్ మృతి

రోడ్డు ప్రమాదంలో ఫోటోగ్రాఫర్ మృతి

బైంసా పట్టణము పార్టీ (బి) బైపాస్ రోడ్డు మార్గంలో సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నిర్మల్ పట్టణంలోని బుధవార్ పేట్ కాలనీ పరిదిలోని యువ ఫోటోగ్రాఫర్ మృతి చెందగా, ఇదే ప్రాంతానికి చెందిన మరో యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. నిర్మల్ పట్టణానికి చెందిన యువ ఫోటోగ్రాఫర్ ఎం. సుమన్ (30) ఆదివారం భైంసాలో తమ సమీప బందువుల ఇంట్లో జరిగిన శుభకార్యక్రమం కోసం గాను వచ్చాడు. వేడుకలన్నీ ముగిసిన అనంతరం సోమవారం సాయంత్రం తన కారులో సమీప బందువు సృజన్ అనే యువకుడితో కలిసి భైంసా పార్డి(బి) బైపాస్ రోడ్డు మార్గం మీదుగా నిర్మల్ కు తిరుగు ప్రయాణంలో ప్రమాదం వారిన పడ్డారు. ఇక్కడి నుంచి బయలుదేరిన 10 నిమిషాల కాల వ్యవధిలోనే వీరు ప్రయాణిస్తున్న కారు బైపాస్ రోడ్డు మార్గంలో అదుపి తప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో యువ ఫోటో గ్రాఫర్ సుమన్ ఘటన స్థలిలోనే మృత్యువాతపడగా, ఇదే కారులో ప్రయాణిస్తున్న మరో యువకుడు సృజన్ తీవ్ర గాయాల పాలయ్యాడు, క్షతగాత్రుడిని స్థానికంగా ప్రథమ చికిత్స నుంచి మెరుగైన చికిత్సల కోసం గాను నిర్మల్ కు తరలించారు. ఘటన స్థలిలో బైంసా టౌన్ సీఐ గోపినాథ్ ప్రమాద ఘటనపై విచారణ చేపట్టారు. అనంతరం సుమన్ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇక్కడి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో ఫోటోగ్రాఫర్ మృతి

మిన్నంటిన రోదనలు….

ఇక్కడి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని పోస్టుమార్టం గదిలోనున్న సుమన్ మృతదేహన్ని చూసి కుటుంబీకులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. సుమన్ అన్న, వదినెమ్మలు మృతదేహం పడి రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. శుభకార్యానికి వచ్చి మృత్యువాత పడటంతో ఇక్కడి బందువులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతునికి భార్యతో పాటు 5 సంవత్సరాలలోపు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

బైంసా ఫోటోగ్రాఫర్స్ సంతాపం….

ఫోటో గ్రాఫర్ సుమన్ మృతి పట్ల భైంసా పట్టణ ఫోటోగ్రాఫర్స్ సంతావం తెలిపారు. ఫోటోగ్రాఫర్స్ ప్రతినిధి రమేష్ పాటిల్ ఘటన స్థలి నుంచి మృతదేహన్ని అంబులెన్స్ ద్వారా ఇక్కడి ఏరియా ఆసుపత్రికి తరలింప చేశారు. నిఖిల్, పండిత్ పాటిల్ తదితర ఫోటోగ్రాఫర్లు మృతుని కుటుంబికులకు అవసరమైన సహాయ, సహాకారాలు అందించారు. సుమన్ తో తమకున్న అనుబందాలను గుర్తుకు తెచ్చుకుంటూ పలువురు బైంసా పోటోగ్రావర్లు కంటతడి పెట్టారు. మృతదేహన్ని చూసి పెద్ద పెట్టున రోదించారు

Join WhatsApp

Join Now

Leave a Comment