మెండోర (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 15
నిజామాబాద్ జిల్లా మెండోర మండలం చాకిర్యాల్ గ్రామ పరిధిలోని సోన్ వంతెనపై అప్పుల బాధతో ఓ యువకుడు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం జరిగిన ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
అప్పుల బాధ తాళలేక ఓ యువకుడు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా మెండోర మండలం చాకిర్యాల్ గ్రామ పరిధిలోని సోన్ వంతెనపై బుధవారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని సోన్ గ్రామానికి చెందిన సుంకరి నరేష్ చారి (27), నరసింహ చారి కుమారుడు. ఆయన హైదరాబాద్ నుంచి కారులో స్వగ్రామానికి వస్తున్న సమయంలో అప్పుల భారంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అనంతరం చాకిర్యాల్ గ్రామ పరిధిలోని సోన్ వంతెనపైకి చేరుకుని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న మెండోర పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించి, తదుపరి చర్యల కోసం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మెండోర పోలీసు అధికారి సుహాసిని తెలిపారు.












