ఉరి వేసుకొని వృద్దుడు మృతి.
సారంగాపూర్ జులై 15 మనోరంజని తెలుగు టైమ్స్
నిర్మల్ జిల్లా, సారంగాపూర్: మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన శివరాత్రి రాములు(64) ఉరి వేసుకొని మృతి చెందినట్లు ఎ ఎస్సై వసంత్ తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మృతుడు రాములు గత కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆరోగ్యం కుదుట పడలేదు అతని కడుపు నొప్పి తగ్గక పోవడంతో మనస్తాపానికి గురై బుధవారం తన ఇంటి యందు దూలానికి నైలాన్ తాడుతో ఉరి వేసుకొని మృతిచెందాడు. మృతుని కుమారుడు రాజేందర్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్సై తెలిపారు.












