సారంగాపూర్, జులై 16
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో "ప్రపంచ పాముల దినోత్సవం" సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మహమ్మద్ నజీర్ ఖాన్ హాజరై, పర్యావరణ సమతుల్యతలో పాముల పాత్రపై వివరించారు.
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో "ప్రపంచ పాముల దినోత్సవం" సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మహమ్మద్ నజీర్ ఖాన్ హాజరై మాట్లాడారు.
పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో పాముల పాత్ర కీలకమని, అవి ఎలుకలు వంటి పంటలకు హాని చేసే జీవులను నియంత్రించడం ద్వారా రైతులకు మేలు చేస్తాయని తెలిపారు. అందువల్ల పాములను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
అన్ని పాములు విషసర్పాలు కావని, కొద్ది జాతులు మాత్రమే విషపూరితమైనవని, మిగిలినవి విషరహిత పాములేనని వివరించారు. పాములపై ప్రజల్లో ఉన్న అపోహలు, భయాలు, సందేహాలను నివృత్తి చేస్తూ, వాటిని చంపకుండా అటవీశాఖ లేదా శిక్షణ పొందిన స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్నేక్ క్యాచర్ షేర్ యాసిన్, పాముల సంరక్షణలో తాను అందిస్తున్న సేవలను వివరించారు. అలాగే వివిధ రకాల పాములు, వాటి గుర్తింపు, పాములు కనిపించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి, వారి సందేహాలను నివృత్తి చేశారు.
అనంతరం స్నేక్ క్యాచర్ షేర్ యాసిన్‌ను అటవీశాఖ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు, అటవీశాఖ బీట్ అధికారులు, వెన్నెల సుజాత పాల్గొన్నారు.











