హైదరాబాద్, 2026-07-16
వేసవి తగ్గుముఖం పట్టి వర్షాకాలం ప్రారంభమైనా ఎండల తీవ్రత తగ్గడం లేదు. దీనికి ప్రధాన కారణంగా వేగంగా తీవ్రరూపం దాల్చుతున్న ‘ఎల్ నినో’ వాతావరణ మార్పు అని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ఈ పరిణామం, మునుపెన్నడూ లేని విధంగా చరిత్రలోనే అత్యంత బలమైన వాతావరణ మార్పులలో ఒకటిగా నిలువనున్నట్టు అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) ధృవీకరించింది.
వేసవి తగ్గుముఖం పట్టి వర్షాకాలం ప్రారంభమైనా ఎండల తీవ్రత తగ్గడం లేదు. దీనికి ప్రధాన కారణంగా వేగంగా తీవ్రరూపం దాల్చుతున్న ‘ఎల్ నినో’ వాతావరణ మార్పు అని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ఈ పరిణామం, మునుపెన్నడూ లేని విధంగా చరిత్రలోనే అత్యంత బలమైన వాతావరణ మార్పులలో ఒకటిగా నిలువనున్నట్టు అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) ధృవీకరించింది. ఈ ఏడాది చివరి నాటికి ఇది మరింత బలపడి, ఉత్తరార్ధగోళ శీతాకాలంలో గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
వాతావరణ శాస్త్రవేత్త జీక్ హౌస్‌ఫాదర్ 14 రకాల వాతావరణ నమూనాల నుండి సేకరించిన 667 అంచనాల విశ్లేషణ ప్రకారం, ప్రస్తుత ఎల్ నినో గతంలో కంటే ఎక్కువ వినాశనాన్ని సృష్టించే అవకాశం ఉంది. అంటే 1982-83, 1997-98, 2015-16 నాటి రికార్డులను కూడా ఇది అధిగమించే అవకాశం ఉందని తెలిపారు. 2015-16లో గరిష్టంగా 2.75°C ఉష్ణోగ్రత వ్యత్యాసం నమోదు కాగా, ఈసారి ఇది ఏకంగా 3.6°C వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
NOAA డేటా ప్రకారం, జూలై 13 నాటికే పసిఫిక్ మహాసముద్రంలోని నినో 3.4′ ప్రాంతంలో ఉష్ణోగ్రత వ్యత్యాసం 2.2°C కి చేరింది. 1982 నుండి ఉపగ్రహ రికార్డులను పరిశీలిస్తే, ఒక క్యాలెండర్ ఏడాదిలో ఇంత ముందుగానే ఈ స్థాయి వేడి నమోదు కావడం ఇదే మొదటిసారని నివేదికలు చెబుతున్నాయి. ఈ స్థాయిలో వేడెక్కడం రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వడగాలులు, వరదలు, కరువు పరిస్థితులు ఏర్పడడానికి సూచనలు కావచ్చని నివేదికలు అంచనా వేస్తున్నాయి.
భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం, ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వర్షపాతం దీర్ఘకాల సగటులో కేవలం 90 శాతం మాత్రమే ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించే ‘హిందూ మహాసముద్ర ద్విధ్రువం’ ఈసారి తటస్థంగా ఉందని.. అంటే, ఎల్ నినో సృష్టిస్తున్న నష్టాన్ని అడ్డుకునే ఎలాంటి సహజ పరిహార యంత్రాంగం ప్రస్తుతం అనుకూలంగా లేదని తెలిపింది. ఈ కారణంగా గత జూన్ నెలలో వర్షపాతం సాధారణం కంటే 40 శాతం తక్కువగా నమోదైంది. గత 126 ఏళ్లలో ఇది దేశంలోనే 5వ అత్యంత తక్కువ వర్షపాతం జూన్‌లోనే నమోదైనట్టు తెలుస్తోంది.











