నిజామాబాద్, జులై 26
జిల్లా కేంద్రంలోని వెల్మ సంఘం ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో సంఘ అభివృద్ధికి ఐక్యతతో ముందుకు సాగాలని మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు పిలుపునిచ్చారు. సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించాలని సూచించారు.
జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఉన్న జిల్లా వెల్మ సంఘం ఫంక్షన్ హాల్లో ఆదివారం జిల్లా వెల్మ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా వెల్మ సంఘం అధ్యక్షులు వి. కిషోర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విఠల్ రావు మాట్లాడుతూ, వెల్మ సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని కోరారు. సంఘ సభ్యులు, గౌరవ సభ్యులు ఐక్యతతో ఉంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. సంఘం అభివృద్ధి కోసం సుమారు రూ.6 కోట్లు విరాళాలు అందించిన 300 మంది సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయమే అంతిమ నిర్ణయమని పేర్కొన్నారు.
ఆల్ ఇండియా వెల్మ సంఘం (ఐవా) నుంచి రూ.5 లక్షల నిధులు అందించాలని కోరారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఇంటర్, డిగ్రీ, పీజీ స్థాయిలో వారి అర్హతను బట్టి స్కాలర్షిప్లు అందించాలని సూచించారు. అలాగే కళ్యాణ మండపాన్ని ఇతరులకు ఇవ్వకుండా సంఘ సభ్యుల ఆధ్వర్యంలో మిగిలిన సుమారు రూ.5 కోట్ల పనులను పూర్తిచేయాలని సమావేశంలో పలువురు కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ సంఘ అధ్యక్షులు ఆర్. రాంకిషన్ రావు, సంఘ అధ్యక్షులు వి. కిషోర్ రావు, కార్యదర్శి దయాకర్ రావు, బి. రాజేశ్వర్ రావు, ఏ. శ్రీనివాస్ రావు, మాజీ లీగల్ అడ్వైజర్ డి. మధుసూదన్ రావు, కోశాధికారి శ్రీనివాస్ రావు, రవీందర్ రావు, ఉపాధ్యక్షులు మంజిత్ రావు రాజు, బి. రమణ రావు, విజయ్ రావు, బాబు రావు, డి. రమణ రావు, వి. అవంత్ రావు, హన్మంత్ రావు, బి. నర్సింగ్ రావు, పురుషోత్తం రావు, బి. శ్రీనివాస్ రావు, నర్సింగ్ రావు ముల్లంగి, నాగారావు, సతీష్ రావు, ధర్మారావు, మిగతా కార్యవర్గం, సంఘం తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు.











