Kamareddy/Bodhan Rural (Kamareddy) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
కామారెడ్డికి చెందిన సిఎస్ఐ సంఘ సభ్యులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించి, అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. యువత ప్రాజెక్టు అందాలను తమ సెల్ఫోన్లలో బంధించగా, నెహ్రూ పార్కులో వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు కామారెడ్డి సిఎస్ఐ సంఘ సభ్యులు ప్రాజెక్టును సందర్శించారు. యువత ప్రాజెక్టు అందాలను ఆస్వాదిస్తూ, సెల్ఫోన్ల ద్వారా వాటిని బంధించారు. అనంతరం నెహ్రూ పార్కులో ఆటపాటలతో ఆనందోత్సాహాలతో గడిపారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి స్థానిక సిఎస్ఐ పాస్టర్ రేవ్ గిరి ప్రసాద్, స్థానిక సెక్రటరీ జాన్ దయాకర్, డేవిడ్ నెల్సన్, మాణిక్యం, యేసు రత్నం, స్త్రీల సమాజం తరపున శాంత, మహిపాల్, యూత్ తేజ, సండే స్కూల్ సెక్రెటరీ సరిత తదితరులు పాల్గొన్నారు.











