నిర్మల్ జిల్లా భైంసా మండలంలో వడదెబ్బతో అస్వస్థతకు గురైన ఒక మహిళను 108 అంబులెన్స్ సిబ్బంది సకాలంలో స్పందించి ప్రాణాపాయం నుంచి తప్పించారు.
వానల్పాడ్ గ్రామానికి చెందిన జాదవ్ వర్ష అనే మహిళ మొక్కజొన్న కోత పనులకు వెళ్ళినప్పుడు తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బకు గురైంది. దీంతో ఆమె వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్ళింది.
కుటుంబ సభ్యులు వెంటనే 108కు సమాచారం అందించడంతో, అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలికి తక్షణ చికిత్స అందించారు. మెడికల్ టెక్నీషియన్ పూజారి లక్ష్మణ్ ఆక్సిజన్, లవణ ద్రావణాలు అందించడంతో ఆమె పరిస్థితి మెరుగుపడింది.
సకాలంలో స్పందించిన అంబులెన్స్ సిబ్బంది చర్యల వల్ల మహిళ ప్రాణాపాయం నుండి బయటపడింది. అనంతరం ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు.
బాధితురాలి కుటుంబ సభ్యులు 108 సిబ్బంది సేవలను ప్రశంసించారు.








