సిద్దూర్ గ్రామానికి చెందిన యువ పూజారి విజయ్ కుమార్ (28) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, చికిత్స కోసం ఆర్థిక సహాయం కోసం తన కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
సిద్దూర్ గ్రామానికి చెందిన పూజారి విజయ్ కుమార్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు అతన్ని నిజామాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు, అయితే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
వైద్యుల అంచనాల ప్రకారం, విజయ్ కుమార్ చికిత్సకు సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చులు అవసరం కానున్నాయి. ఇప్పటికే కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఈ భారీ ఖర్చులను భరించడం కష్టంగా మారింది.
ఇటీవల వివాహం చేసుకున్న విజయ్ కుమార్ కు రెండేళ్ల చిన్న పాప ఉంది. కుటుంబాన్ని పోషించాల్సిన తరుణంలో ఆయన అనారోగ్యానికి గురికావడం కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు తీవ్ర ఆవేదనను కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో, దాతలు, సేవా దృక్పథం కలిగిన వ్యక్తులు ముందుకు వచ్చి విజయ్ కుమార్ చికిత్సకు ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సహాయం చేయాలనుకునేవారు నేరుగా కుటుంబ సభ్యులను సంప్రదించవచ్చు.












