సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధులకు అత్యాధునిక చికిత్స అందుబాటులోకి వచ్చిందని ఆసుపత్రి ఆంకాలజిస్ట్, హేమటాలజిస్ట్ డాక్టర్ సుమంత్ కుమార్ తెలిపారు. మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
కల్తీ ఆహారం, ప్లాస్టిక్ వాడకం వంటివి క్యాన్సర్కు ప్రధాన కారణాలని డాక్టర్ సుమంత్ కుమార్ పేర్కొన్నారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడానికి 'పెట్ సిటీ స్కాన్' ఉపయోగపడుతుందని ఆయన వివరించారు.
ప్రస్తుతం రేడియేషన్, కీమోథెరపీలతో పాటు, యశోద ఆసుపత్రిలో హైపర్ సైట్ మిషన్ ద్వారా అత్యాధునిక చికిత్స అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి అడ్వాన్స్ మెడిసిన్, ఇమ్యునో థెరపీ వంటి చికిత్సలు కూడా అందిస్తున్నామని ఆయన చెప్పారు.
యశోద ఆసుపత్రిలో అన్ని రకాల క్యాన్సర్లకు అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉందని, రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సుమంత్ కుమార్ కోరారు. పట్టణంలోని సూర్య డయాగ్నస్టిక్ సెంటర్లో ప్రతి నెలా నాలుగవ బుధవారం క్యాన్సర్ సంబంధిత రోగులకు చికిత్స అందిస్తామని తెలిపారు.












