హోమియోపతి మరియు ఆయుష్ దినోత్సవ సందర్భంగా నిర్మల్ జిల్లా ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన్ లో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించబడుతోంది.
తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా, ఏప్రిల్ 10వ తేదీన హోమియోపతి మరియు ఆయుష్ దినోత్సవం పురస్కరించుకుని ఈ ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
క్యాంపులో భాగంగా ఉదయం 6:30 నుండి 7:30 గంటల వరకు యోగా అవగాహన శిబిరం, ఆ తర్వాత ఉదయం 9:30 గంటల నుండి ఆయుష్ మెగా క్యాంప్ ప్రారంభమవుతుంది. ఈ శిబిరాన్ని ఆయుష్ డిపార్ట్మెంట్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ నారాయణరావు తెలిపారు.
అనుభవజ్ఞులైన వైద్యులచే ఉచితంగా చికిత్స అందించడంతో పాటు, అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.











