బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ సమీపం, బ్రాహ్మణపల్లి, కామారెడ్డి (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 04
బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. సుమారు 35-40 ఏళ్ల వయసున్న వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన మృతుడి ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలి ( బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని కిలోమీటర్ నంబర్ 570/3-4 వద్ద కాచిగూడ–నిజామాబాద్ డెమో ప్యాసింజర్ రైలు కింద పడి సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసున్న గుర్తుతెలియని పురుషుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆత్మహత్యగా ప్రాథమికంగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు పింక్, తెలుపు రంగుల అడ్డగీతల టీషర్ట్, నలుపు రంగు నైట్ ప్యాంట్, ఆకుపచ్చ రంగు డ్రాయర్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా అతడిని గుర్తించిన వారు కామారెడ్డి రైల్వే ఎస్ఐ ఎస్. లింబాద్రిను సంప్రదించాలని పోలీసులు కోరారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 87126 58614 మృతుడి ఆచూకీ లేదా కుటుంబ సభ్యుల వివరాలు తెలిసిన వారు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.











