భవానిపురం (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 03
భవానిపురం ప్రాంతంలో పోలీస్ కెమెరాల వీడియో ఫుటేజ్ భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫుటేజ్ ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉందంటూ వాట్సాప్‌లో సమాచారం ప్రచారం అవుతోంది. ఇది దర్యాప్తు ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
పోలీస్ కెమెరాల భద్రతపై సందేహాలు..? భవానిపురంలో సీసీ కెమెరాల ఫుటేజ్ ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉందంటూ వాట్సప్‌లో ప్రచారం భవానిపురం: పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారంగా నిలిచే సీసీ కెమెరాల వీడియో ఫుటేజ్ భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భవానిపురం ప్రాంతంలో పోలీస్ కెమెరాల (యాక్సిస్) వీడియో ఫుటేజ్ ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉందంటూ వాట్సప్‌లో ఓ సమాచారం ప్రచారం అవుతోంది. ఏదైనా నేరం లేదా ఇతర ఘటన జరిగినప్పుడు సీసీ కెమెరాల ఫుటేజ్ పోలీసులకు మూడో నేత్రంలా ఉపయోగపడుతుంది. అలాంటి కీలకమైన వీడియో ఫుటేజ్ అనధికార వ్యక్తుల చేతికి చేరితే దర్యాప్తు ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే పోలీస్ కెమెరాల ఫుటేజ్ నిజంగా ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉందా? అలా ఉంటే ఫుటేజ్ వారికి ఎలా చేరింది? దానికి బాధ్యులు ఎవరు? అనే అంశాలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఈ అంశంపై పూర్తి వివరాలు, వాస్తవ పరిస్థితులపై విశ్లేషణతో ప్రత్యేక కథనం రేపటి తెలుగు తేజం దినపత్రికలో ప్రచురితం కానున్నట్లు వాట్సప్‌లో సమాచారం వైరల్ అవుతోంది.












