సికింద్రాబాద్, 2026
సికింద్రాబాద్‌లో శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర-2026ను ఘనంగా నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సికింద్రాబాద్ జోన్ డీసీపీ శ్రీమతి రక్షిత కృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, ఉత్సవ నిర్వాహకులు హాజరయ్యారు.
సికింద్రాబాద్: శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర-2026ను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వకర్మ ఫంక్షన్ హాల్లో ఈ సమావేశం నిర్వహించారు.
సికింద్రాబాద్ జోన్ డీసీపీ శ్రీమతి రక్షిత కృష్ణమూర్తి, ఐపీఎస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ జె. నర్సయ్య, ఏసీపీ చ. శ్రీధర్, మహంకాళి ఇన్స్పెక్టర్ ఎస్. రవికుమార్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే, ఉజ్జయిని మహంకాళి ఆలయ కమిటీ సభ్యులు, పలహారం బండి, తోటెలు, వెల్కమ్ స్టేజ్ నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు కూడా హాజరయ్యారు.
బోనాల జాతరను వైభవంగా, ప్రశాంతంగా, భద్రతా ప్రమాణాలతో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు, ట్రాఫిక్, భద్రత, ఇతర సమన్వయ చర్యలపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి, నిర్దేశిత పనులను సకాలంలో పూర్తి చేయాలని డీసీపీ సంబంధిత అధికారులను ఆదేశించారు.












