నాగిరెడ్డిపేట్, జూలై 9
నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు వద్ద గురువారం గంగమ్మ దేవత అమ్మవారికి మాజీ జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాజెక్టు నిండు కుండలా నిండాలని ఆకాంక్షిస్తూ అమ్మవారికి ఐదు టెంకాయలు కొట్టి మొక్కుకున్నారు.
నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు వద్ద గురువారం గంగమ్మ దేవత అమ్మవారికి మాజీ జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రాజెక్టు నిండు కుండలా నిండాలని ఆకాంక్షిస్తూ అమ్మవారికి ఐదు టెంకాయలు కొట్టి మొక్కుకున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిన అనంతరం 101 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకుంటానని తెలిపారు.
ప్రతి ఏడాది ఇదే విధంగా గంగమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నట్లు ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు చేరి రైతాంగానికి మేలు జరగాలని ప్రార్థించారు.












