*" (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 13
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET-2026) ఫలితాలు సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు విడుదల కానున్నాయి. హైదరాబాద్లోని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో అధికారులు ఫలితాలను ప్రకటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,53,752 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET-2026) ఫలితాలు సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు విడుదల కానున్నాయి. హైదరాబాద్లోని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో అధికారులు ఫలితాలను ప్రకటించనున్నారు.
జూన్ 16 నుంచి 22 వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,53,752 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో పేపర్-1కు 50,113 మంది, పేపర్-2కు 1,03,639 మంది పరీక్ష రాశారు.
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ tgtet.aptonline.in లేదా schooledu.telangana.gov.in లో హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.












