బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 10
పటేల్్భత్ెసిడెన్షియల్పటేల్ఠశలల్లోిద్య్థలఅభ్యన్నతికిెగైనిద్యతోపటేల్టఅన్నిసౌక్యలకల్పటేల్ించలనిఎ్ెల్యేపటేల్్్పటేల్టేల్అధికలనఆదేశించ.బైంసలోనితననిసంలోిిధెసిడెన్షియల్పటేల్ఠశలలపటేల్్ిన్సిపటేల్ల్స్తోని్హించినసీక్షసేశంలోఆయనఈసూచనలచేశ.
ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతోపాటు, అవసరమైన సౌకర్యాలను కల్పించాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు.
శుక్రవారం బైంసాలోని తన నివాసంలో కస్తూరిబా, సోషల్ వెల్ఫేర్, మైనార్టీ, ఆదర్శ పాఠశాల, గిరిజన ఆశ్రమ పాఠశాలల ప్రిన్సిపల్స్‌తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పాఠశాల ప్రిన్సిపల్‌ను పిలిచి విద్యార్థుల అడ్మిషన్ వివరాలతో పాటు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు ఎక్కువగా చదువుతారని, వారిని అన్ని రంగాల్లో తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రిన్సిపల్స్‌పై ఉందన్నారు. వర్షాకాలం సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, వారికి మంచి పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ రాజు మాట్లాడుతూ, తమ పాఠశాలను సందర్శించి, 45 లక్షల రూపాయల నిధులను వెచ్చించి, చేపట్టిన పనులు పూర్తి చేసినందుకు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్‌కు ధన్యవాదాలు తెలిపారు. విద్యా రంగంపై శాసనసభ్యులు రామరావ్ పటేల్ దృష్టి సారించడం పట్ల కృతజ్ఞతలు చెప్పారు. సమావేశంలో ఆయా పాఠశాలల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.












