విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరం : ఎంఈఓ రామావత్ వరలక్ష్మి
👉 *మిధాన్ష్ పుట్టినరోజు వేడుకలు*
మిర్యాలగూడ జూలై 13 (మనోరంజని తెలుగు టైమ్స్)
విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని అడవిదేవులపల్లి మండల విద్యాధికారి రమావత్ వరలక్ష్మి అన్నారు. సోమవారం మండలంలోని ఉల్సాయిపాలెం మండల పరిషత్ఉన్నతపాఠశాలలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం పోషణ్ పంచ భోజన తిథి భోజనం కార్యక్రమం మండల విద్యాధికారి రమావత్ వరలక్ష్మి నేతృత్వంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ వరలక్ష్మి మాట్లాడుతూ
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు మెనూ ప్రకారం బలవర్ధకమైన ఆహారాన్ని అందించడమే తిథి భోజనం ముఖ్య ఉద్దేశమన్నారు. దాతలు ముందుకు వచ్చి శుభ కార్యక్రమాలను నిర్వహించే సమయంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు
పండ్లు,కూరగాయలు,చికెన్‌తో కూడిన పౌష్టికాహారాన్ని అందించేందుకు ముందుకు రావాలన్నారు.
పాఠశాలప్రధానోపాధ్యాయుడు రమేష్ మాట్లాడుతూపాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మెనూ పౌష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు.ఉల్సాయిపాలెం పాఠశాలలో మండల విద్యాశాఖాధికారిని రమావత్ వరలక్ష్మి మనవడు మిధాన్ష్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ప్రత్యేక చికెన్ భోజనం,అరటి పండ్లు,చాక్లెట్లను పంపిణీ చేశారు.విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించిన ఎంఈఓ వరలక్ష్మి కుటుంబ సభ్యులకు పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి మిధాన్ష్కి పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయబృందం చంద్రశేఖర్,రామకృష్ణ,సింధు తదితరులు పాల్గొన్నారు.












