ప్రతి ఇంటా మొక్కలు నాటాలి. ఎంపిఓ అజీజ్ ఖాన్.
సారంగాపూర్ జులై 07 మనోరంజని తెలుగు టైమ్స్
నిర్మల్ జిల్లా,సారంగాపూర్: ప్రతి ఇంటా మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని ఎంపిఓ అజీజ్ ఖాన్ అన్నారు. మంగళవారం మండలంలోని స్వర్ణ గ్రామంలో గ్రామ సర్పంచ్ తోకలసి మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పచ్చదనం పెంపొందితేనే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించగలమన్నారు. అనంతరం బోరిగామ్ గ్రామంలో ఓటరు ఎస్.ఐ.ఆర్ ఫారాలు స్వీకరణను పరిశీలించారు.రవీంద్రనగర్ తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు ను ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రంలో గ్రామ సర్పంచ్ లు కొత్తింటి మల్లేష్,జాదవ్ దిలీప్,బొబ్బిలి గోదావరి గ్రామాల పంచాయతీ కార్యదరులు వార్డు సభ్యులు పాల్గొన్నారు.











