మామడ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 30
నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొంకల్ గ్రామంలో వెలసిన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నూతనంగా బోర్ వేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ చైర్మన్ కాలగిరి గంగారెడ్డి హాజరై, ఆలయ అభివృద్ధికి రూ. 20 వేల నగదు విరాళం అందించారు.
నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొంకల్ గ్రామంలో వెలసిన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నూతనంగా బోర్ వేయించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మాజీ చైర్మన్ కాలగిరి గంగారెడ్డి కొబ్బరికాయ కొట్టి ఈ నూతన బోర్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారంగా 20 వేల రూపాయల నగదు విరాళాన్ని ఆలయ నిర్వాహకులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రవితో పాటు వడ్ల నరేష్, తాళ్లపల్లి శేఖర్, సల్కం ప్రశాంత్, దొరగారి లక్ష్మణ్, తాళ్ల పెళ్లిరాజు, గంగారెడ్డి, కోరుట్ల లక్ష్మణ్, కొత్తపల్లి గంగన్న, కోరుట్ల గంగన్న తదితరులు పాల్గొన్నారు.












