ప్రొద్దుటూరులో మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన సంఘటన చోటుచేసుకుంది. ఎర్రగుంట్ల బస్ స్టాండ్ వద్ద అనారోగ్యంతో మరణించిన గుర్తుతెలియని వ్యక్తికి, బంధువులు లేకపోవడంతో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు ముందుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
స్థానిక ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని ఉంచారు. ఎర్రగుంట్ల బస్ స్టాండ్ వద్ద అనారోగ్యంతో మరణించిన వ్యక్తికి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో, పోలీసు సిబ్బంది మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్ ను ఫోన్ ద్వారా సంప్రదించారు. వారు వెంటనే స్పందించి, ఈరోజు హిందూ స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ గొప్ప కార్యక్రమానికి చేయూత అందించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబాహన్, అశోక్, సతీష్, గౌస్ పాల్గొని అంత్యక్రియలను పూర్తి చేశారు. సమాజంలో ఎవరూ లేని వారికి కూడా గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు జరగాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టామని ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు తెలిపారు.
మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ నిరంతరం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ, అవసరంలో ఉన్న వారికి అండగా నిలుస్తుందని ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఫౌండేషన్ శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు కూడా సహాయం అందిస్తోంది. ఆసక్తి గల దాతలు ఈ నంబర్లను సంప్రదించవచ్చు: 82972 53484, 9182244150.












