నగరం, 2024-08-30
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆదివారం మున్నూరు కాపు సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో శ్రీమతి వారధి స్వర్ణలత నూతన అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. చేయూత వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఏటిగడ్డ శ్రీనివాసులు పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరిగింది.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం 11 గంటలకు మున్నూరు కాపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. జిల్లాలోని నల్లవెల్లి రోడ్, సబ్-జైలు ఎదురుగా గల కీర్తిశేషులు వారధి మాణిక్, మాజీ సైనికుడు, నివాస గృహంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మున్నూరు కాపు కుల సోదరులు, బంధువులు హాజరయ్యారు.
చేయూత వెల్ఫేర్ సొసైటీ, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఏటిగడ్డ శ్రీనివాసులు పర్యవేక్షణలో జరిగిన ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. కింద తెలిపిన వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
నూతన అధ్యక్షురాలిగా శ్రీమతి వారధి స్వర్ణలత, వైస్ ప్రెసిడెంట్లుగా తీగేల భాస్కర్, పాలమూరు శంకరయ్య, జనరల్ సెక్రటరీగా ఏటిగడ్డ శ్రీనివాసులు, జాయింట్ సెక్రటరీగా జాజుల బాలరాజ్, క్యాషియర్‌గా వారధి నరేందర్ ఎన్నికయ్యారు. అలాగే, ఈసీ మెంబర్లుగా పొడుగు రాఘవులు, వారధి శ్రీనివాసులు, మాదాసు శ్రీనివాసులు, సలహాదారుగా అడ్వకేట్ జంగిటి ఎన్. అంజలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నూతన అధ్యక్షురాలిగా ఎన్నికైన శ్రీమతి వారధి స్వర్ణలత మాట్లాడుతూ, ఇంత పెద్ద పదవికి తనను ఎన్నుకున్నందుకు ముందుగా కుల సోదరులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మనమందరం సంఘటితమై రాజ్యాధికారం దిశగా కదలాలని కోరారు.











