నిర్మల్, 2026-08-02
నిర్మల్ పట్టణంలో బోనాల పండుగ సందర్భంగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సతీమణి శ్రీమతి ఏలేటి కవిత రెడ్డి నంది గుండం శ్రీ దుర్గామాత ఆలయం, బంగల్పేట్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాలను సందర్శించి భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించారు. అనంతరం ఒడి బియ్యం పోసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ కమిటీ స్వాగతం
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి ఆశీస్సులతో నిర్మల్ జిల్లా ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ఉండాలని ఆమె ప్రార్థించారు.
బోనాల పండుగ ఆకాంక్ష
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. అమ్మవారి దివ్య కరుణాకటాక్షాలు ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.