ఖానాపూర్, 2026-08-02
ఆషాడ మాసం సందర్భంగా ఖానాపూర్ లోని శ్రీ వీరాంజనేయ శివ సాయి సమాజ్, జంగల్ హనుమాన్ ఆధ్వర్యంలో ఆదివారం అమ్మవారికి గోరింటాకు కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఎంతో ఘనంగా, విజయవంతంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని, అమ్మవారికి గోరింటాకు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

ముఖ్య అతిథుల హాజరు
ఈ కార్యక్రమానికి ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అంకం మౌనిక మహేందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని అభినందించారు. అలాగే మాజీ ఏపీపీఎస్సీ మెంబర్ రవీందర్ రావు గారి సతీమణి ఉమాదేవి పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
నిర్వాహకుల కృతజ్ఞతలు
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి మహిళకు, నిర్వాహకులకు, భక్తులకు మరియు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ శ్రీ వీరాంజనేయ శివ సాయి సమాజ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్, పదో వార్డు కౌన్సిలర్ బండి సింధుజ ప్రకాష్ గౌడ్, పట్టణంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు కొక్కుల ప్రదీప్ మరియు కమిటీ సభ్యులు మహిళలకు అన్ని సౌకర్యాలు కల్పించారు.