నిజామాబాద్, ఆగస్టు 2
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం యంచా గ్రామంలోని శ్రీ జగద్దాద్రి ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు హాజరై, ఆలయ గురువైన స్వర్ణ కమల లక్ష్మి అమ్మవారిని శాలువాతో సత్కరించి ఆశీర్వాదాలు పొందారు.
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం యంచా గ్రామంలోని శ్రీ జగద్దాద్రి ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు హాజరై, ఆలయ గురువైన స్వర్ణ కమల లక్ష్మి అమ్మవారిని గురుపౌర్ణమి సందర్భంగా శాలువాతో సత్కరించి ఆశీర్వాదాలు పొందారు.
ఈ సందర్భంగా విఠల్రావు మాట్లాడుతూ, ప్రపంచంలోనే ప్రత్యేకతను సంతరించుకున్న జగద్దాద్రి ఆలయాన్ని కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించి, జిల్లా ప్రజలు, భక్తులు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రతి ఏడాది యజ్ఞాలు, యాగాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషమన్నారు.
తమిళనాడులో ఆలయ నిర్మాణానికి భూమి విరాళంగా ఇస్తామని చెప్పినప్పటికీ, యంచా గ్రామంలోనే భూమిని కొనుగోలు చేసి ఈ ఆలయాన్ని నిర్మించిన స్వర్ణ కమల లక్ష్మి అమ్మవారి సేవాభావం ప్రశంసనీయమని కొనియాడారు.
గోదావరి నది తీరాన ఆహ్లాదకరమైన ప్రకృతి మధ్య వెలసిన ఈ ఆలయం ఒకవైపు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం, మరోవైపు శ్రీ విఠలేశ్వర ఆలయాల మధ్య భక్తులకు ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలుస్తోందని తెలిపారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన భక్తుల ఊరేగింపు కన్నులపండువగా సాగి, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని గురుపౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.












