బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 19
రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. ఆదివారం భైంసాలోని ఎస్.ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీలో 125 మంది లబ్ధిదారులకు 55.58 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్య ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీఎంఆర్ఎఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని భైంసాలో గల ఎస్. ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీలో 125 మంది లబ్ధిదారులకు 55 లక్షల 58 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రజలకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తితే కొంత సహాయం చేయాలన్న ఉద్దేశంతో తన కార్యాలయాన్ని సీఎంఆర్ఎఫ్ కేంద్రంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రత్యేకంగా ఇద్దరు పీఏలను నియమించి, గతంలో కంటే ఎక్కువగా గత రెన్నరేళ్లలో 5000 మందికి ఆర్థిక సహాయం అందించామని పేర్కొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయంగా ముందుకు సాగుతానని, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మహిళా సమైక్య భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, పాఠశాలలకు ప్రహరీ గోడ నిర్మాణాలను చేపడుతున్నామని తెలిపారు. దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర అమ్మవారి ఆలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి 325 కోట్లు కేటాయించడం అదృష్టమని, అదేవిధంగా ఆలయ నిర్మాణం కోసం దాత 30 కోట్లు ఇవ్వడం శుభసూచకమని అన్నారు.
అంతకుముందు మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాత్రి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, కుంటాల మండల నాయకులు బి.వి. రమణారావు, కుంటాల సర్పంచ్ గజేందర్, భైంసా పట్టణ, మండల అధ్యక్షులు రావుల రాము, సిరం సుష్మరెడ్డి, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుపోతుల మల్లేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలోనే అత్యధికంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించిన ఘనత ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ దేనని కొనియాడారు. నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో అభివృద్ధికి నిధులు తెస్తున్న ఘనత ఆయనదేనన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బి. గంగాధర్, సర్పంచులు, నాయకులు, బీజేపీ బాధ్యులు పాల్గొన్నారు.












