మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 20
తెలంగాణ ఉద్యమంలో నిజంగా పోరాడిన ఉద్యమకారులకు తగిన గౌరవం, గుర్తింపు కల్పించాలని ఎంఆర్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు పెంటనోళ్ల నరసింహ మాదిగ డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన కార్యక్రమంలో అసలైన ఉద్యమకారులను విస్మరించడం బాధాకరమని ఆయన అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో నిజంగా పోరాడిన ఉద్యమకారులకు తగిన గౌరవం, గుర్తింపు కల్పించాలని ఎంఆర్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు పెంటనోళ్ల నరసింహ మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో అసలైన ఉద్యమకారులను విస్మరించడం బాధాకరమని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఎంఆర్పీఎస్, మాదిగ ఉద్యమకారులు కీలక పాత్ర పోషించారని, ఆ విషయాన్ని నాయకులు మర్చిపోవద్దని ఆయన పేర్కొన్నారు. వేదికపై సన్మానం పొందిన వారిలో ఉద్యమ సమయంలో లాఠీ దెబ్బలు తిన్న వారు, కేసులు ఎదుర్కొన్న వారు ఎంతమంది ఉన్నారో ప్రజలకు చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
ఉద్యమంలో ముందుండి పోరాడిన విద్యార్థి నాయకులు, యువతకు గుర్తింపు లేకపోవడం విచారకరమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అత్యధికంగా నష్టపోయింది యువతేనని, అలాంటి వారిని పక్కన పెట్టి కార్యక్రమాలు నిర్వహించడం సరికాదని విమర్శించారు.
ఇకనైనా టీజేఏసీ నాయకులు, నిర్వాహకులు నిజమైన ఉద్యమకారులను గుర్తించి వారికి న్యాయం చేయాలని పెంటనోళ్ల నరసింహ మాదిగ కోరారు.











