Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 20
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం తాండ్ర. జి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త జగత్ ప్రసాద్ తల్లి, వైకుంఠ పూర్ (ధోనిగమ్) గ్రామానికి చెందిన గ్రామ కారోబార్ చుక్క బోట్ల రాజేశ్వర్ మరణించిన కుటుంబాలను సారంగాపూర్ మాజీ జడ్పీటీసీ సభ్యుడు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి సోమవారం పరామర్శించారు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం లోని తాండ్ర. జి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త జగత్ ప్రసాద్ తల్లి గత ఐదు రోజుల క్రితం మరణించారు. అలాగే వైకుంఠ పూర్ (ధోనిగమ్ ) గ్రామానికి చెందిన గ్రామ కారోబార్ చుక్క బోట్ల రాజేశ్వర్ మూడు రోజుల క్రితం గుండె పోటుతో మరణించారు. ఈ రెండు వేర్వేరు సంఘటనలలో బాధిత కుటుంబాలను సారంగాపూర్ మాజీ జడ్పీటీసీ సభ్యుడు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి గారు సోమవారం రోజున పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
వారి కుటుంబాలకు అండగా ఉంటామని పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైకుంఠ పూర్ గ్రామ సర్పంచ్ జంగం ఆనంద్, సారంగాపూర్ మార్కెట్ డైరెక్టర్ సాదప్రశాంత్, గుర్రాల రాజేశ్వర్, చిన్నయ్య, మోహన్, లింగయ్య, గజానంద్, కాంగ్రెస్ పార్టీ సారంగాపూర్ మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.











