నిర్మల్, జూలై 20
ప్రజావాణికి వచ్చే దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం చేయకుండా, ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే స్పందించాలని సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను ప్రాధాన్యంగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను శాఖల మధ్య సమన్వయంతో పరిష్కరించేలా అధికారులు పనిచేయాలని పేర్కొన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను ప్రజలు అదనపు కలెక్టర్కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.