లక్ష్మణచాంద, జూలై 29
భారీ వర్షాల కారణంగా లక్ష్మణచందా–కంజర ప్రధాన రహదారిపై చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానిక యువకులు వెంటనే స్పందించి చెట్లను తొలగించడంతో రాకపోకలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి.
భారీ వర్షాల కారణంగా లక్ష్మణచందా–కంజర ప్రధాన రహదారిపై చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక యువకులు వినేష్, అక్షయ్, నరసయ్య, సాయికుమార్ వెంటనే స్పందించి రహదారిపై అడ్డంగా పడిన చెట్లను తొలగించారు. దీంతో రాకపోకలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి.
స్థానికులు యువకుల సేవా భావాన్ని అభినందిస్తూ, అత్యవసర సమయంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజలకు సహాయం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.











