ఢిల్లీ / చీరాల, ఆగస్టు 4, 2026
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వేదికగా జరిగిన ఒక నెల రోజుల యువజన ఉద్యమం భారతదేశ రాజకీయ, సామాజిక చరిత్రలో ఒక అపూర్వ అధ్యాయాన్ని లిఖించింది. ముఖ్యంగా జూలై 20 నుంచి 25వ తేదీల మధ్య చెలరేగిన యువత ఉప్పెన, బహిరంగ నియంతృత్వం వైపు పయనిస్తున్న ప్రభుత్వానికి గట్టిదెబ్బ కొట్టింది. ఈ పోరాటం కేవలం ఒక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగింది మాత్రమే కాదు, నిర్బంధం, అణచివేత, వ్యూహాత్మక కుట్రల నడుమ నలిగిపోతున్న ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి జెన్ జీతరం చేపట్టిన ఒక చారిత్రక ఉద్యమం.
ప్రజాస్వామ్యంలో ప్రజలదే తిరుగులేని శక్తి. ఎంతటి బలమైన పాలనైనా ప్రజల ఆగ్రహానికి, ముఖ్యంగా యువత ఉద్యమాల ముందు తలవంచక తప్పదు. ఇటీవల ఢిల్లీలోని జంతర్‌మంతర్ వేదికగా సాగిన ఒక నెల రోజుల యువజన ఉద్యమం భారతదేశ రాజకీయ, సామాజిక చరిత్రలో ఒక అపూర్వ అధ్యాయాన్ని లిఖించింది. ముఖ్యంగా జూలై 20 నుంచి 25వ తేదీల మధ్య చెలరేగిన యువత ఉప్పెన, బహిరంగ నియంతృత్వం వైపు పయనిస్తున్న ప్రభుత్వానికి గట్టిదెబ్బ కొట్టింది. ఈ పోరాటం కేవలం ఒక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగింది మాత్రమే కాదు. నిర్బంధం, అణచివేత, వ్యూహాత్మక కుట్రల నడుమ నలిగిపోతున్న ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ‘జెన్ జీ’తరం చేపట్టిన ఒక చారిత్రక ఉద్యమం.
దేశంలో నెలకొన్న అణచివేత ధోరణులు, నిరుద్యోగం, నిర్బంధ విధానాలకు వ్యతిరేకంగా 15 నుంచి 30 సంవత్సరాల వయస్సు కలిగిన యువతీ యువకులు ఒక్కటయ్యారు. జంతర్‌మంతర్ వద్ద ప్రారంభమైన ఈ నిరసన కొద్ది రోజుల్లోనే ఒక ప్రభంజనంలా మారింది. పార్లమెంటును చుట్టుముట్టడం ద్వారా, దేశ రాజధానిలో తమ నిరసన గళాన్ని గట్టిగా వినిపించారు. ఈ పోరాటం కేవలం ఢిల్లీకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి చిన్న, పెద్ద నగరంలో యువత వీధుల్లోకి వచ్చి సభలు, ప్రదర్శనలు నిర్వహించారు.
‘రాజు దిగంబరంగా ఉన్నాడు’ అనే కథలాగే, పాలకవర్గాల అసలు స్వరూపాన్ని, వారి నైతిక దివాలాకోరుతనాన్ని యువత ప్రపంచం ముందు ఆవిష్కరించింది. యువత ఉప్పెనలా విరుచుకుపడటంతో కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర గందరగోళంలో పడింది. తీసుకుంటున్న ప్రతి చర్య వికటించడం, వేస్తున్న వ్యూహాలన్నీ విఫలం కావడం బాహాటంగా కనిపించింది. అర్ధరాత్రి వరకు మేల్కొని సోషల్ మీడియా రీల్స్ ద్వారా యువతను ఆకట్టుకోవడానికి ప్రయత్నించగా, యువత ఆ దీన విజ్ఞప్తులను పట్టించుకోకుండా మరింత వ్యంగ్యంగా, హాస్యభరితంగా రికార్డ్ చేస్తూ ఎగతాళి చేశారు. ఉద్యమ తీవ్రతకు తలవంచి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే, ఈ ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి మరుసటి రోజే లోక్‌సభలో ఆయనకు ఘన స్వాగతం పలకడం, ఆయన స్థానంలో బిల్కిస్ బానో నిందితులను సమర్థించిన ప్రహ్లాద్ జోషిని తీసుకురావడం ద్వారా ప్రభుత్వం తన అహంకారాన్ని ప్రదర్శించింది.
ఈ కొత్తతరం పోరాటం పొరుగు దేశాల్లో జరిగిన తిరుగుబాట్ల కంటే చాలా భిన్నమైనది. విశిష్టమైనది. యువత ఎటువంటి భయం లేకుండా, వ్యంగ్యం, హాస్యం, మీమ్స్, పదునైన పంచ్ లైన్లతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. హిందుత్వ రూపంలో కార్పొరేట్ లాభాల పల్లకీని మోస్తున్న పాలకవర్గాల కుయుక్తులపై యువతకు పూర్తి స్పష్టత ఉంది. 2021 నవంబర్ 19న దేశ రైతులు ఏవిధమైన దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారో, అదే ఉత్సాహాన్ని 2026 జూలై 25న దేశ యువత అంతకుమించిన తీవ్రతతో పునరావృతం చేసింది.












