న్యూ ఢిల్లీ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 04
న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మంగళవారం నుంచి ప్రారంభం కానున్న నిరవధిక ధర్నాలో పాల్గొనేందుకు మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి సహారా బాధితులు, సిబ్బంది పెద్ద ఎత్తున తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలులో బయలుదేరి వెళ్లారు. ఈ నెల 5, 6, 7 తేదీలలో ఈ ధర్నా జరగనుంది.

బాధితుల విజ్ఞప్తి
ఈ సందర్భంగా సహారా బాధితులు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో సహారా ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తమ డబ్బులు గడువు దాటినప్పటికీ ఇంకా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ డబ్బులు చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, సహారా ఇండియాలో విధులు నిర్వహిస్తున్న 15 లక్షల మంది సిబ్బందిని కూడా ఆదుకోవాలని కోరారు.
ప్రభుత్వానికి వినతి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకుని 13 కోట్ల మంది సహారా బాధితులకు 40 వేల కోట్ల రూపాయలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే 15 లక్షల మంది సహారా సిబ్బందిని కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రతిపక్షాల మద్దతు
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎల్ఓపీ రాహుల్ గాంధీ కూడా 13 కోట్ల మంది సహారా బాధితులు, 15 లక్షల మంది సహారా సిబ్బంది సమస్యను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో సహారా మేనేజర్ ఎస్ టీ రావు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.