న్యూఢిల్లీ, 27 July
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద "జర్నలిస్ట్స్ ఛలో పార్లమెంట్" పేరుతో ధర్నా జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద "జర్నలిస్ట్స్ ఛలో పార్లమెంట్" పేరుతో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రైల్వే రాయితీ పునరుద్ధరణ, జాతీయ మీడియా కమిషన్ ఏర్పాటు, నూతన వేతన బోర్డు, జర్నలిస్టుల రక్షణ చట్టం అమలు, డిజిటల్ మీడియా జర్నలిస్టులకు సమాన హోదా కల్పించాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి IFWJ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు చిర్రా శ్రీనివాస్ గౌడ్ కూడా పాల్గొని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.












