పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, గామలపాడు గ్రామంలో నిర్మించనున్న పల్నాడు శ్రీ మహా శైవ క్షేత్ర దేవాలయాల శంకుస్థాపన కరపత్రాలను మిర్యాలగూడలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పల్నాడు మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణ మూర్తి యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
శనివారం మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జంగా కృష్ణ మూర్తి యాదవ్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, జూలై 4న జరగనున్న శంకుస్థాపన పూజా కార్యక్రమానికి హాజరు కావాలని ప్రత్యేకంగా ఆహ్వానం అందజేశారు. అనంతరం బీసీ భవన్లో స్థానిక బీసీ నేతలతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జంగా కృష్ణ మూర్తి యాదవ్ మాట్లాడుతూ, టీటీడీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆలయ నిర్మాణానికి అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని, పూజల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆలయ అభివృద్ధికి అందరూ కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జూలై 4న జరగనున్న శంకుస్థాపన పూజా కార్యక్రమానికి ప్రజలందరూ హాజరై, ఆలయ నిర్మాణానికి సహకరించాలని బీసీ జేఏసీ కన్వీనర్ మారం శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి స్థానిక నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు కృషి చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ కన్వీనర్ మారం శ్రీనివాస్, కోకన్వీనర్లు దాసరాజు జయరాజు, చేగొండి మురళి యాదవ్, మహేష్ గౌడ్, లక్ష్మయ్య గురూజీ, హనుమయ్య, నాయుడు సురేష్, మహేష్ యాదవ్, జంగా లక్ష్మణ్ యాదవ్, వాడపల్లి లక్ష్మీనారాయణ యాదవ్, ఆలయ కమిటీ చైర్మన్ కొండూటి సిద్దయ్య, పుట్టపాక శ్రీను, కోటయ్య, మీనాక్షి, శ్రీలక్ష్మి, ఉమా, సుజాత, శ్రీదేవి పద్మ తదితరులు పాల్గొన్నారు.












