వెంకటాపూర్ కాలనీలో జరిగిన సాయి సంకీర్తన కార్యక్రమం భక్తులను ఆకర్షించింది.
నిర్మల్ పట్టణంలోని వెంకటాపూర్ కాలనీలో, శనివారం సాయంత్రం సాయి సంకీర్తన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ముందుగా, సాయి పాదుకలు మరియు సాయి చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. అనంతరం, సాయిబాబా ఆశీర్వచనాలు ఎల్లవేళలా ఉండే విధంగా సాయినాథుని చిత్రపటాన్ని అందజేశారు.
సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి, ప్రతి శనివారం సాయి భక్తుల ఇళ్లల్లో వారి కోరిక మేరకు సాయి సంకీర్తన మరియు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి సభ్యులు పండరి, ఉప్పుల నందు, రాజు, శ్రీనివాస్ వర్మ, లింగారెడ్డి, కోల శంకర్, గోపాల్ రెడ్డి, జొన్నల మనోహర్, మహేందర్ యాదవ్, సుదర్శన్, అజయ్ నారాయణరెడ్డి, సత్యం, శ్రీనివాస్ కైలాసపతి, తిరుపతి, రేఖ, మాధవి, రాణి తదితరులు పాల్గొన్నారు.








