బాసర, 24 July
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీ చార్జిని ఖండిస్తూ బాసరలో కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ నిర్వహించింది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని, నిరసనకారులపై లాఠీ చార్జిని నిలిపివేయాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీ చార్జి చేయడాన్ని ఖండిస్తూ బాసర మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని, నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.
ఈ ప్రెస్ మీట్ లో నిర్మల్ జిల్లా డీసీసీ వైస్ ప్రెసిడెంట్ మమ్మాయి రమేష్ మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పటిష్టపరిచే చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ప్రెస్ మీట్ లో బాసర టౌన్ అధ్యక్షులు రాజేశ్వర్ దేశాయి, మాజీ జనరల్ సెక్రెటరీ సంజీవ్ రావ్ దేష్ముఖ్, ఆత్మ డైరెక్టర్ జలీల్, 10వ వార్డు మెంబర్ నానం సాయిలు, సీనియర్ నాయకులు ఖలీల్, జంగం రాజేందర్, CH నాగరాజు, నానం నర్సయ్య, రామదాస్, భుమన్నోల్ల అశోక్, గురప్ప శంకర్, SK విక్రమ్, విశ్వనాథ్ దేష్ముఖ్, తదితరులు పాల్గొన్నారు.












