హైదరాబాద్, జులై 24
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందజేసే యూనిఫాంల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, ఆగస్టు 15 నాటికి పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాణ్యత, సైజులపై విద్యార్థుల నుంచి వాట్సాప్ ద్వారా ఫీడ్బ్యాక్ సేకరిస్తామని తెలిపారు.
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేసే యూనిఫాం పంపిణీ నాణ్యతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు ఇచ్చే దుస్తుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులందరికీ ఆగస్టు 15 నాటికి యూనిఫాంలు అందజేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆలస్యమైతే సహించేది లేదని, త్వరగా సరఫరా చేయాలని సంస్థలపై ఒత్తిడి పెంచాలని సీఎం స్పష్టం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులందరికీ వెంటనే ఏకరూప దుస్తులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యూనిఫామ్స్ ఇచ్చిన తర్వాత వాటి నాణ్యత, సైజు, ఇతర అంశాలపై ప్రతి విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.












