బోధన్, 2026-06-05
బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్ సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్‌ను తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజేవీపీ) నాయకులు సందర్శించి, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీజేవీపీ బోధన్ డివిజన్ కార్యదర్శి మదరోళ్ల నిఖిల్ విద్యార్థులతో సమావేశమయ్యారు.

సౌకర్యాలపై ఆరా
హాస్టల్లో విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా, తాగునీరు, విద్యుత్, పరిశుభ్రత, వసతి వంటి సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయా అనే విషయాలను తాము పరిశీలించినట్లు నిఖిల్ తెలిపారు. విద్యార్థుల అవసరాలను, ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు.
పరిష్కారానికి హామీ
విద్యార్థులు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, వాటి పరిష్కారం కోసం తెలంగాణ విద్యార్థి పరిషత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నిఖిల్ హామీ ఇచ్చారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.