మిర్యాలగూడ, 2026-08-30
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఆదివారం జరిగిన భాస్కర్, అవంతికల వివాహ రిసెప్షన్‌కు పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. దామరచర్ల మండలం వాడపల్లి గ్రామ మాజీ సర్పంచ్, దేవాలయ చైర్మన్ కొందూటి సిద్దయ్య, మాధవిల కుమారుడి వివాహానికి ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డులో గల ఎస్.పి. ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన దామరచర్ల మండలం వాడపల్లి గ్రామ మాజీ సర్పంచ్, శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ కొందూటి సిద్దయ్య, మాధవిల ఏకైక కుమారుడు భాస్కర్, అవంతికల వివాహ రిసెప్షన్‌కు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ప్రముఖుల ఆశీస్సులు
ఈ వేడుకకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్), ఎమ్మెల్సీలు కేతావత్ శంకర్ నాయక్, ఎం.సి. కోటిరెడ్డి, టీటీడీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చిలుకూరి బాలకృష్ణ, గుడిపాటి నవీన్ కుమార్, ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ యువ నేత నల్లమోతు సిద్ధార్థ, నల్గొండ జిల్లా సీనియర్ జర్నలిస్ట్, మిర్యాలగూడ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు ఎండి. అస్లాం, గుడిపాటి సైదులు బాబు హాజరయ్యారు.
వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వధూవరులను ఆశీర్వదించారు.












