మామడ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 13
మామడ మండలంలోని బండల్ ఖానాపూర్ గ్రామానికి నూతన ప్రాథమిక పాఠశాల భవనం మంజూరు చేయాలని కోరుతూ గ్రామ ప్రజాప్రతినిధులు, పెద్దలు సోమవారం జిల్లా కలెక్టర్ బావేష్ మిశ్రాకు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం సరైన భవనం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్కు వివరించారు.
మామడ మండలంలోని బండల్ ఖానాపూర్ గ్రామానికి నూతన ప్రాథమిక పాఠశాల భవనాన్ని మంజూరు చేయాలని కోరుతూ గ్రామ ప్రజాప్రతినిధులు సోమవారం జిల్లా కలెక్టర్ బావేష్ మిశ్రాకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జాదవ్ సచిన్ కళ్యాణి, ఉప సర్పంచ్ మద్దిల పద్మ, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు బాధవత్ తులసి, గ్రామ పెద్దలు కలెక్టర్కు గ్రామంలోని పరిస్థితులను వివరించారు. ప్రస్తుతం గ్రామంలో సరైన ప్రాథమిక పాఠశాల భవనం లేకపోవడంతో చిన్నారులు విద్యాభ్యాసానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త పాఠశాల భవనాన్ని వెంటనే మంజూరు చేయాలని కోరారు.
గ్రామ ప్రతినిధుల వినతిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి, పాఠశాల భవనం మంజూరు అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కలెక్టర్ సానుకూల స్పందన పట్ల గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
వినతిపత్రం సమర్పించిన వారిలో గ్రామ సర్పంచ్ జాదవ్ సచిన్ కళ్యాణి, ఉప సర్పంచ్ మద్దిల పద్మ, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు బాధవత్ తులసి, గ్రామ పెద్దలు ఎ. భూమయ్య, బి. రమేష్, బి. గంగారాం తదితరులు పాల్గొన్నారు.












