వేల్పూర్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 01
బాల్కొండ బి.ఆర్.ఎస్. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని భీంగల్ పట్టణ సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు బుధవారం వేల్పూర్ లో మర్యాదపూర్వకంగా కలిసి ఊర పండుగ ఆత్మీయ ఆహ్వాన పత్రికను అందజేశారు. జూలై 15న జరిగే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, బాల్కొండ బి.ఆర్.ఎస్. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని బుధవారం వేల్పూర్ లోని తమ నివాస భవనంలోని ప్రత్యేక ఛాంబర్ లో భీంగల్ పట్టణ సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఊర పండుగ ఆత్మీయ ఆహ్వాన పత్రికను అందజేశారు.
తదనంతరం భీంగల్ పట్టణ సర్వసమాజ్ అభివృద్ధి కమిటి అధ్యక్షుడు పతాని కృష్ణ, ఉపాధ్యక్షుడు తీగల రఘు మీడియాతో మాట్లాడుతూ, నవవసంతాల పిమ్మట జూలై 15 ఆదివారం రోజున నిర్వహించనున్న ఊర పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొని గ్రామదేవతల ఆశీస్సులు పొందాలని కోరారు. ఎమ్మెల్యే సైతం తప్పకుండా పాల్గొంటానని మాట ఇచ్చారని తెలిపారు.
ఎమ్మెల్యేను కలిసి ఆహ్వానించిన వారిలో భీంగల్ పట్టణ సర్వ సమాజ్ అభివృద్ధి కమిటి అధ్యక్షుడు పతాని కృష్ణ, ఉపాధ్యక్షుడు తీగల రఘు, ప్రధాన కార్యదర్శి నిచ్చెమోల్ల రాజేశ్వర్, కోశాధికారి ఎస్పీ. భూమేశ్వర్, సలహా కమిటీ సభ్యులు, భీంగల్ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు నీలం రవి, మల్లెల ప్రసాద్, బొదిరె నర్సయ్య, గున్నాల బాలభాగత్, మాజీ కౌన్సిలర్ సతీష్ గౌడ్, బొట్ల రామకృష్ణ తదితరులు ఉన్నారు.











