వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాలలో పిఎసిఎస్ ఐకెపి వరి ధాన్యం కేంద్రాలను ప్రారంభించిన నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిట సునీత లక్ష్మారెడ్డి

వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాలలో పిఎసిఎస్ ఐకెపి వరి ధాన్యం కేంద్రాలను ప్రారంభించిన

నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిట సునీత లక్ష్మారెడ్డి

మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ఏప్రిల్ ఏప్రిల్ 16

మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిట సునీత లక్ష్మారెడ్డి వరి ధాన్యం కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బుధవారం నాడు వెల్దుర్తి మండల కేంద్రంలోని వరి ధాన్య కేంద్రంతోపాటు మండలంలోని పలు గ్రామాలు
కుకునూరు, మన్నె వారి జలాల్పూర్, దామరంచ, ధర్మారం, అందుగులపల్లి గ్రామాలలోని పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని
అనంతరం అక్కమ్మ పల్లి గ్రామం, మహమ్మద్ నగర్ తండాలో ఐకెపి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని వారు తెలియజేశారు. రైతులు పండించిన వంటి వరి పంట ప్రభుత్వమే సరసమైన ధరలకు తీసుకుంటుందని రైతులు అక్రమ దారులకు వరి ధాన్యాన్ని అమ్మకుండా నేరుగా మీకు అందుబాటులో ఉన్నటువంటి వరి ధాన్యం కేంద్రానికి తీసుకొని రావాలని రైతు లేనిదే రాజ్యం లేదని రైతులు పండించినటువంటి ఆరు గారు కష్టాన్ని ప్రభుత్వం అర్థం చేసుకొని వారి శ్రమకు తగినంత ధరను ఇవ్వడం జరుగుతుందని రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా నేరుగా వరి ధాన్య కేంద్రాలను సందర్శించి మీరు పండించినటువంటి వరి ధాన్యాన్ని వరి ధాన్య కేంద్రాల కు తీసుకురావాలని వరి ధాన్యం కేంద్రాలలో రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు ఎల్లవేళలా సందర్శించి వారికి సహకరించి వారి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆమె తెలియజేశారు ప్రభుత్వం ప్రకటించిన ధర ఏ గ్రేడ్ 2320 రూపాయలు సాధారణ రకం 2300 ల రూపాయలు రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తేమ17.0 శాతం వించరాదని చెత్త తాళ్లు1.0 శాతం మట్టి పేల్లరాలు1.0 శాతం చెడిపోయిన రంగు మారిన మొలకెత్తిన ధాన్యం ఐదు శాతం పూర్తిగా తయారు కాని ముడుచుకుపోయిన ధాన్యం3.0 శాతం తక్కువ రకములు మిశ్రమం6.0 శాతం రైతులు పండించిన సరుకులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా శుభ్రపరచి ఎవరి కల్లాల దగ్గర వారే వరి ధాన్యాన్ని ఎండబెట్టుకొని తీసుకొని రావాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అనంత రెడ్డి మాజీ జెడ్పిటిసి రమేష్ గౌడ్ తాజా మాజీ ఎంపీటీసీ మోహన్ రెడ్డి మెదక్ సొసైటీ మాజీ వైస్ చైర్మన్ కోదండ కృష్ణ గౌడ్ మాజీ ఎంపీటీసీ అశోక్ గౌడ్ బస్సాపూర్ మాజీ సర్పంచ్ మల్లేశం గౌడ్ పడిగ నరసింహులు సొసైటీ డైరెక్టర్ రమేష్ చందర్ సొసైటీ వైస్ చైర్మన్ కర్ణ మురళి సొసైటీ డైరెక్టర్ ఉదండపురం నరసింహులు బిఆర్ఎస్ నాయకులు వేన్నవరం శ్రీనివాస్ రెడ్డి నర్సాపూర్ ఆంజనేయులు వెన్నవరం గ్యాస్ శ్రీనివాస్ రెడ్డి చల్ల మహేష్ యాదవ్ వ్యవసాయ అధికారిని ఝాన్సీ వ్యవసాయ విస్తీర్ణ అధికారులు మజీద్ వందన సీఈవో సిద్దయ్య అశోక్ తాసిల్దార్ కృష్ణ ఆర్ఐ నర్సింగ్ యాదవ్ పలు గ్రామా పంచాయతీ మాజీ సర్పంచులు బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment